ఇసుక కొరతతో కుంటుపడ్డ పనులు: జన్నారం మండలంలో సర్పంచ్ల ఆవేదన

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం సర్పంచులకు అభివృద్ధి పనులు చేపట్టడం తలనొప్పిగా మారింది. నాలుగు నెలలుగా మండలంలోని పలు గ్రామాలలో ప్రజాప్రతినిధులు సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు భూమిపూజలు చేశారు. అయితే స్థానిక వాగుల నుంచి ఇసుక సేకరణకు అనుమతులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదని సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.