విశాఖ షిప్యార్డులో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పర్యటన: నేడు కీలక ప్రారంభోత్సవాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

భారత నౌకాదళానికి ఊతమిచ్చేలా హిందుస్థాన్ షిప్యార్డులో పలు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు జరగనున్నాయని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారీ స్లిప్వే బెర్తుతో పాటు నూతన గొలియాత్ క్రేనును ఆయన ప్రారంభించనున్నారని నిర్వాహకులు స్పష్టం చేశారు.