సిరిసిల్ల మహిళలకు సువర్ణ అవకాశం.. ఉద్యోగాల భర్తీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సిరిసిల్ల

సిరిసిల్ల జిల్లాలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు కీలక అవకాశం అందుబాటులోకి వచ్చింది. పంచుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ టెస్పోర్ట్ కంపెనీలో ఐరనింగ్ వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు హెచ్ఆర్ కామెర మధు కుమార్ వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి మరియు అర్హత కలిగిన మహిళలు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా కంపెనీ కార్యాలయానికి వెళ్లి ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని ఆయన స్పష్టం చేశారు. స్థానిక మహిళలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.