సెప్టెంబర్ 30 లోగా నీట్ పీజీ ఫలితాలు విడుదల చేయనున్న ఎన్బీఈఎంఎస్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 30 నాటికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 30న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2.65 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్ అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.