అమెరికా మీడియా సంస్థల నిషేధంపై ట్రంప్ ప్రభుత్వంతో న్యాయపోరాటం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి ప్రముఖ మీడియా సంస్థల జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోకి అనుమతించకపోవడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారంటూ ఈ మూడు మీడియా సంస్థలు ట్రంప్ ప్రభుత్వంపై ఉమ్మడిగా కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. తమ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే కోర్టును ఆశ్రయించినట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అయితే ఫేక్ న్యూస్ ప్రసారం చేసే మీడియాపైనే చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.