స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత: పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి తగిన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. నిబంధనల ప్రకారం క్రిటికల్, సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఓటర్లు ఎలాంటి భయాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.