ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఇందల్వాయిలో కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ మండలం ఇందల్వాయిలో మండల అధ్యక్షుడు దామ సుమన్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూంపల్లి మహేందర్, విశిష్ట అతిథిగా చింతల కిషన్ హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తూంపల్లి మహేందర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.