జన్నారంలో కనీస వసతులు లేక రోడ్డెక్కిన చిరు వ్యాపారులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో చిరు వ్యాపారులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి ప్రధాన రహదారి పక్కనే కూరగాయలు విక్రయిస్తున్న వీరికి తాగునీరు మరియు మూత్రశాలలు వంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అధికారులు తక్షణమే స్పందించి తమ ఇబ్బందులను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.