సమస్యలొస్తే ఒత్తిడికి గురికావద్దు.. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదంటూ డాక్టర్ పాపి నాయుడు హితవు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాపి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలపై చర్చించారు. సమస్యలు ఎదురైనప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు, వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రఘురాం, చిన్నం నాయుడు, మెడికల్ కౌన్సిలర్ బగాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.