రైలులో చైను పోయిందని భయపడి: వృద్ధురాలపై దాడి చేసి మహిళ అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: ఎలమంచిలి
రైలులో బంగారం చైను పోగొట్టుకున్న విషయం భర్తకు తెలియకుండా ఉండేందుకు ఓ మహిళ విపరీతమైన అడుగు వేసింది. ఎలమంచిలిలోని రామ్మూర్తినగర్లో రిటైర్డ్ ఉపాధ్యాయిని ఇంట్లోకి ప్రవేశించి ఆమె కంట్లో కారం కొట్టి మూడున్నర తులాల గొలుసును దోచుకెళ్లింది. ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ టేజీ ఆధారంగా నిందితురాలు గొర్లె కల్పనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ ధనుంజయరావు తెలిపారు.