టాలీవుడ్ నుంచి దొంగ నా కొడుకు చిత్రం టీజర్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న దొంగ నా కొడుకు చిత్ర టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసినట్లు మేకర్స్ తెలిపారు. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమాలో మౌళి హీరోగా నటిస్తుండగా, సుస్మితా శెట్టి నాయికగా కనిపించనుంది. శ్రీను కంబాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అలీ, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.