యువతకు కొత్త అనుభూతి: రామగిరిలో ఉత్సాహంగా సాగుతున్న ట్రెక్కింగ్ యాత్ర

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

జిల్లాలో పర్యాటక రంగానికి జీవం పోసేలా యువత కోసం ప్రత్యేకంగా ట్రెక్కింగ్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రామగిరి ఖిల్లాతో పాటు సీతమ్మ లొద్ది ప్రాంతంలో అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ శ్రీహర్ష ప్రత్యేక ప్రోత్సాహంతో ఈ ప్రాంతాల వైపు పర్యాటకులు ఆకర్షితులవుతున్నారని, దీనివల్ల స్థానిక పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని నిర్వాహకులు తెలిపారు.