ఇల్లు మీదే ఇంటిపై సర్వ హక్కులూ మీవే
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Visakhapatnam
పేద కుటుంబాలకు ఇల్లు మరియు భూమిపై సర్వ హక్కులు కల్పిస్తూ దశాబ్దాలుగా ఉన్న సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా సొంతింటి కలతో పాటు ఆ ఇంటిపై సంపూర్ణ యాజమాన్య హక్కును ప్రభుత్వం అందిస్తోందని, దీని ద్వారా నిరుపేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్నామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.