పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: భారతదేశం
తన జన్మదినం సందర్భంగా దేశ విదేశాల నుంచి అభినందనలు కురిపించిన ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమ తనను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని, దేశ ప్రజలకు నిరంతరం సేవ చేసేందుకు ఈ ఆశీస్సులు తనకు సరికొత్త శక్తిని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. పుట్టినరోజు వేడుకలను సాధారణంగా జరుపుకోవడానికి బదులుగా లక్షలాది మంది పౌరులు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.