సత్యనికేతన్ భవన కూల్చివేత ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

సత్యనికేతన్ భవన కూల్చివేత ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకు అధికారులు తెలిపారు. విద్యార్థుల వసతి గృహాలు, పీజీల భద్రతపై ఈ కమిటీ సమగ్ర విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భవనాల నిబంధనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ వివరించింది.