స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై షాక్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాబోయే అక్టోబర్ 1, 2026 నుంచి కొన్ని ప్రత్యేక ఖాతాలకు సంబంధించిన ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితుల్లో ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద నెలకు పొందే ఉచిత లావాదేవీల పరిమితిని 10 నుంచి 5కు కుదించినట్లు పేర్కొన్నారు. పరిమితి దాటితే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.