మేడ్చల్ జిల్లాలో భారీ దొంగతనం: రూ. రెండు కోట్ల వజ్రాభరణాలు అపహరణ

రిపోర్టర్: హరి స్థలం: Medchal-Malkajgiri

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని క్యారెట్ లేన్ జ్యువెలరీ షోరూమ్లో తెల్లవారుజామున భారీ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు షట్టర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించి రూ. రెండు కోట్లకు పైగా విలువైన వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.