కోనేరులో మునిగి ముగ్గురు పాఠశాల విద్యార్థులు దుర్మరణం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బుధరాయవలస గ్రామంలో కోనేరు నీటిలో మునిగి ముగ్గురు పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన చిన్నారులను చందు, వెంకటేశ్, హేమచందర్ రావుగా గుర్తించారు. ఈత కొట్టడానికి వెళ్లిన క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.