మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కిరాయి కుట్ర: రాయచోటిలో అంతర్రాష్ట్ర రౌడీ ముఠా అరెస్ట్
రిపోర్టర్: సునీల్
స్థలం: రాయచోటి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని హత్య చేసేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చిందని రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పంజాబ్, కర్నూలు ప్రాంతాలకు చెందిన అంతర్రాష్ట్ర రౌడీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మారణాయుధాలు, పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కిరాయి మూకలను రప్పించి భయాందోళనలు సృష్టించేందుకు కుట్ర పన్నారని మంత్రి మండిపడ్డారు.