ప్రశ్న రావణ్ కేసు దర్యాప్తు గడువు పొడిగింపు: నెల్లూరు జైల్లోనే యూట్యూబర్

రిపోర్టర్: సురేష్ స్థలం: మచిలీపట్నం

సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసు దర్యాప్తు గడువును మచిలీపట్నం కోర్టు పొడిగించినట్లు గన్నవరం పోలీసులు తెలిపారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న నిందితుడి గడువును మరో ముప్పై రోజులు పెంచుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు పోలీస్స్టేషన్లలో రావణ్పై ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి.