ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ లో ధీరజ్ బొమ్మదేవర సంచలన స్వర్ణం
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
మెక్సికోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్-2026లో తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర అద్భుతమైన స్వర్ణ పతకం సాధించారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి భారత ఆర్చర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. జపాన్ ప్రత్యర్థిపై ఉత్కంఠభరిత పోరులో గెలుపొంది దేశ కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టారు. ఈ చారిత్రాత్మక విజయంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.