నంద్యాల జిల్లా యువత సేవలను మన్కీ బాత్లో ప్రశంసించిన మోదీ

రిపోర్టర్: సునీల్ స్థలం: నంద్యాల

వందల ఏళ్ల నాటి పాడుబడిన బావులు, కోనేరుల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న నంద్యాల జిల్లా యువత సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువత పాడుబడిన బావిని బాగు చేసిందని ఆదివారం జరిగిన మన్కీ బాత్లో ఆయన ప్రస్తావించారు. కొలిమిగుండ్లకు చెందిన కాంత్ తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షకసేన పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి, విరాళాలు సేకరిస్తూ శ్రమదానంతో చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం తెస్తున్నారని ప్రధాని కొనియాడారు.