దక్షిణాది సదస్సు విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తిన నారా లోకేష్
రిపోర్టర్: రమేష్
స్థలం: గుంటూరు
దక్షిణాది సదస్సు విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఆహ్వానం కోసమో లేదా ప్రత్యేక మర్యాదల కోసమో అడుగుతున్న అంశం కాదని, ఆ సదస్సు స్వయంగా దాని నిష్పక్షపాతత, విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఇది నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సరైన వేదిక అయితే, నిబంధనలు పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.