షాకింగ్ ఘటన: బీచ్లో రీల్స్ పిచ్చిలో పడి సముద్రంలో కొట్టుకుపోయిన చిన్నారి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

సోషల్ మీడియా రీల్స్ మోజులో పడి కన్న బిడ్డ ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టిన అజాగ్రత్త ఘటన తీవ్ర కలకలం రేపింది. బీచ్లో భార్యాభర్తలు రీల్స్ చిత్రీకరిస్తుండగా సముద్రపు అలల తాకిడికి చిన్నారి నీటిలో కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని నెటిజన్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అయితే, అక్కడే ఉన్న ఓ యువకుడు తక్షణమే స్పందించి పాపను రక్షించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.