బీసీ రిజర్వేషన్లపై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం: జగన్పై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను గత వైకాపా ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి కుదించి తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలకు నలభై శాతానికి పైగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ భరోసా ఇస్తోందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేందుకు వైకాపా నాయకులు న్యాయస్థానాల్లో కేసులు వేయిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.