ప్రత్తిపాడులో భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు నేడు సెలవు
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ప్రత్తిపాడు
ప్రత్తిపాడు మండలంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 25న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల సూచన ఉన్నందున విద్యార్థులు పాఠశాలలకు రావద్దని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సెలవు ఉత్తర్వులు మండలంలోని అన్ని విద్యా సంస్థలకు వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.