వైసీపీ శాప్ ముట్టడికి యత్నం నేపథ్యంలో నేతలకు నోటీసులు
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడలోని శాప్ కార్యాలయం ముట్టడికి వైసీపీ తలపెట్టిన ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపిక ప్రక్రియ మరియు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తికి పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.