నెల్లూరులో కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని వేమిరెడ్డి పిలుపు
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తాలూరి శశికుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కోరారు. నేత నగర్ మరియు శ్రీనివాస్ నగర్ ప్రాంతాలలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ప్రజలను అభ్యర్థించారు.