ఖైరతాబాద్ ఉపఎన్నికల నిర్వహణపై ప్రధాన రాజకీయ పార్టీల్లో పెరుగుతున్న కలవరం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉపఎన్నికల నిర్వహణపై ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల్లో తీవ్ర కలవరం నెలకొందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఈ ఉపఎన్నిక అనవసరపు ఖర్చుతో పాటు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం ఇవ్వదనే చర్చ జరుగుతోంది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.