ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం: బిజినెస్ జెట్ కుప్పకూలి తొమ్మిది మంది మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: అమెరికా

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ వెల్లడించారు. ప్రయాణికులతో వెళ్తున్న బిజినెస్ జెట్ అనూహ్యంగా కుప్పకూలడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులోని డ్యాష్క్యామ్ లో విమానం కూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత విభాగాలు దర్యాప్తు జరుపుతున్నాయి.