నా జీవితంలో తొలిసారిగా భయంకరమైన పాత్రలో నటించానంటూ మోహన్బాబు ప్రశంసలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తొలిసారిగా ఒక భయంకరమైన పాత్రలో నటించానని ప్రముఖ నటుడు డాక్టర్ మోహన్ బాబు వెల్లడించారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' చిత్రం విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చిత్రంలో సికంజమాలిక్ లాంటి విలక్షణ పాత్ర పోషించడం కొత్త అనుభూతినిచ్చిందని, దర్శకుడు శ్రీకాంత్ తనను ఊహించని విధంగా కొత్త కోణంలో చూపించారని మోహన్ బాబు కొనియాడారు.