సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌రెడ్డికి ఘన సన్మానం
రిపోర్టర్: md khaleel
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో న్యాల్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కె. భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్గుగుచ్ఛం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని నూతన అధ్యక్షుడికి తమ అభినందనలు తెలియజేశారు.