అమెరికాలో ఘనంగా ఈస్ట్ బే కా రాజా గణేష్ ఉత్సవాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమెరికా

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామన్ నగరంలో ఈస్ట్ బే కా రాజా బే ఏరియాస్ గ్రాండ్ గణేష్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా జరిగింది. బిషప్ రాంచ్ లేదా సిటీ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలకు సుమారు 25 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు. 12 అడుగుల భారీ గణేష్ విగ్రహం, ప్రత్యేక పూజలు, సహస్ర హారతి, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఈ ఉత్సవం కన్నులపండువగా ముగిసింది.