స్పైస్‌జెట్ విమాన రద్దు వివాదం: ప్రయాణికులకు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
ముంబై నుంచి గోరఖ్‌పూర్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం చివరి నిమిషంలో రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని ప్రయాణికురాలు విజయ లక్ష్మి మాల్యా తెలిపారు. విమానం ఎక్కించి సేఫ్టీ బ్రీఫింగ్ పూర్తి చేసిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల ల్యాండింగ్ ఆంక్షల పేరుతో సిబ్బంది దిగిపోవాలని చెప్పడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి బాధ్యత లేకుండా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.