గుండెపోటుతో కోట డీలర్ మృతి చెందడంతో పరామర్శించిన బేబీనాయన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని దిబ్బవీధికి చెందిన కోటా డీలర్ నడిపేన దామోదర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు అలియాస్ బేబీనాయన వెంటనే స్పందించి మృతుని భౌతిక కాయాన్ని సందర్శించారు. దామోదర్ పార్థివ శరీరానికి ఘన నివాళులు అర్పించి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించి మనో ధైర్యాన్ని అందించారు.