అంకుశం రాజా బినామీ ఆస్తుల బాగోతం వెలుగులోకి
రిపోర్టర్: సురేష్
స్థలం: వైయస్ఆర్ కడప
కడపలో రూ.65 లక్షలతో కొనుగోలు చేసిన భవనం డిపాజిటర్ల నిధులతోనే సమకూర్చినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. సోదరి పుష్పలతను బినామీగా పెట్టి అంకుశం రాజా ఈ ఆస్తిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో వెల్లడైంది. రెండు కుటుంబాల మధ్య మాటల్లేకపోయినా, అవసరాల కోసం ఆమెను మచ్చిక చేసుకుని ఈ మోసానికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.