బీసీ రిజర్వేషన్ల కోతపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుంచి కుదించడంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కేవలం లబ్ధి పొందే అంశం కాదని, అది వారి ప్రాథమిక రాజకీయ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. అవసరమైతే ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం సీట్లు కేటాయిస్తామని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.