రేషన్ దుకాణాల వద్ద వసతులు లేక ప్రజల అవస్థలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుపతి
ఎండలు మండిపోతున్న వేళ రేషన్ దుకాణాల వద్ద కనీస వసతులు కరవయ్యాయి. కలిగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, గూడూరు ప్రాంతాల్లో లబ్ధిదారులు ఎండలోనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తాగునీరు, కూర్చొనేందుకు కుర్చీలు లేక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సమయపాలన పాటించకుండానే దుకాణాలు మూసేస్తున్నారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.