చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ ఉచిత నవీకరణకు యూఐడీఏఐ కీలక అవకాశం

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ ఉచిత నవీకరణకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక అవకాశం కల్పించింది. ఐదేళ్లు నిండిన పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వివరాలను ఈ నెల 30వ తేదీ లోపు ఎలాంటి రుసుము లేకుండా సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాల్లో అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. గడువు దాటితే రుసుము చెల్లించాల్సి వస్తుందని, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అందడానికి ఈ ప్రక్రియ అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు.