'ఆళ్ల నాని హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది': చంద్రబాబు, జగన్ సంతాపం

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

మాజీ ఉప ముఖ్యమంత్రి, వైకాపా నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ ఎలియాస్‌ ఆళ్ల నాని (56) విశాఖపట్నంలో గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. విశాఖ సీతమ్మధారలో పత్రిక చదువుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన పార్థివదేహాన్ని విశాఖ నుంచి ఏలూరుకు తరలించారు. నాని హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.