రాఫెల్ వివాదం తరహాలోనే ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం అంటూ బీజేపీ ధ్వజం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Telangana

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుగా వక్రీకరించి ఆ తర్వాత క్షమాపణ కోరిన వైనాన్ని BJP Telangana గుర్తుచేశారు. ఈసీ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవమని స్పష్టమైనప్పటికీ రాహుల్ గాంధీ మళ్లీ అవే అబద్ధాలతో తప్పుడు ప్రచారానికి తెరలేపారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలోనూ ఇలాగే నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను పక్కదోవ పట్టించారని పేర్కొంటూ, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని BJP Telangana డిమాండ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు గుప్పించారు.