భారత్ లో భారీ మార్పులు: పదేళ్ల అనుభవాలను పంచుకున్న పోలాండ్ మహిళ
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
భారతదేశంలో దశాబ్ద కాలంలో వచ్చిన ఊహించని మార్పులపై పోలాండ్ దేశానికి చెందిన డొమినికా పటాలాస్ కల్రా తన అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. చిన్న టీ బండ్ల వద్ద కూడా క్యూఆర్ కోడ్ లతో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆధునిక విమానాశ్రయాలు, ఎక్స్ప్రెస్వేలు, రైల్వేల అభివృద్ధి దేశ రూపురేఖలను పూర్తిగా మార్చివేసిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ అద్భుతమైన మార్పులను తాను ప్రత్యక్షంగా చూశానని ఆమె వివరించారు.