రాష్ట్రంలో ముగిసిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు: కడపలో ఉద్రిక్తతలు
రిపోర్టర్: హరి
స్థలం: కడప
రాష్ట్రంలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ముగిసిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశాంతంగా సాగిన ఈ పోలింగ్ లో కొన్ని ప్రాంతాల్ లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప మరియు పులివెందుల నియోజకవర్గాల్ లో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.