సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ, రంగంలోకి ఎన్ఐఏ
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో అత్యాధునిక ఆయుధాల చోరీ ఘటన కలకలం రేపుతోంది. రాత్రి వేళల్లో సీసీ కెమెరాలు నిలిపివేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత వ్యక్తుల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు, ఉగ్ర కోణంపై ఎన్ఐఏ, ఐబీలతో కలిసి విచారణ వేగవంతం చేశాయి. చోరీకి గురైన ఆయుధాల ఆచూకీ కోసం 800 మంది సిబ్బందిని విచారిస్తున్నారు.