అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విజయనగరం పోలీసులు సహాయక చర్యలు
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారని విజయనగరం పోలీసులు వెల్లడించారు. విజయనగరం ఎస్పీ శ్రీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రక్షణ చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టామని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సహాయం అందిస్తున్నారని స్పష్టం చేశారు.