కల్లూరు వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్గా కొత్తపల్లి ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కల్లూరు మండల కన్వీనర్గా కొత్తపల్లి వెంకటనారాయణ అలాగే కో-కన్వీనర్గా భానోత్ రేణుక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధి హామీ సదస్సులో తొమ్మిది మందితో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు జిల్లా నేతలు తెలిపారు. వ్యవసాయ, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొని విజయం సాధించిన వారికి ఘనంగా అభినందనలు తెలిపారు.