కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఏకగ్రీవంగా నూతన కమిటీల ఎన్నిక

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిట్యాల, లక్ష్మీసాగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న అధ్యక్షతన ఈ ఎన్నికలు జరిగాయి. చిట్యాల అధ్యక్షుడిగా కుడిమెత ఇస్రు పటేల్, లక్ష్మీసాగర్ అధ్యక్షుడిగా మోతే పెద్దరాజన్న ఎన్నికయ్యారు. నూతన కమిటీలు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.