వాహనదారులకు షాక్: డ్రైవింగ్ లైసెన్స్ జారీలో కొత్త నిబంధనలు తెచ్చిన ఆర్టీఓ

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో తెలంగాణ రవాణా శాఖ విప్లవాత్మక మార్పులు తెచ్చిందని అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పర్మినెంట్ లైసెన్స్ కోరుకునే దరఖాస్తుదారులు ఆన్లైన్లో రెండున్నర గంటల డిజిటల్ శిక్షణ పూర్తి చేయడం తప్పనిసరి చేశామని తెలిపారు. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పర్యవేరించే ఈ విధానాన్ని ప్రస్తుతం యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.