అన్నదాతలకు తీపి కబురు: వేరుశనగ పొట్టుతో పుట్టగొడుగుల సాగుపై శాస్త్రవేత్తల పరిశోధన
రిపోర్టర్: సతీష్
స్థలం: జునాగఢ్
వేరుశనగ పొట్టుతో పుట్టగొడుగులను విజయవంతంగా పండించవచ్చని గుజరాత్లోని జునాగఢ్ శాస్త్రవేత్తలు గుర్తించారని ఐసీఏఆర్ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా లభిస్తున్న వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అన్నదాతలకు అదనపు ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు స్పష్టం చేశారు. ఈ సరికొత్త విధానం ద్వారా రైతులు ఒకేసారి రెండు రకాల పంటల ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు.