భూముల రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్: పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చందాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భూ హద్దులను కచ్చితంగా గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మరోవైపు ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు తక్కువ నీటితో సాగుచేసే ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.